How to prepare chicken curry
చికెన్ కర్రీ
కావాల్సిన పదార్థాలు :
చికెన్ 1/2 kg
ఆయిల్ 4 స్పూన్లు
బిర్యానీ ఆకులు 2
దాల్చిన చెక్క 2
అనాస పువ్వు 1
యాలకులు 2
లవంగాలు 2
ఉల్లిపాయలు 2
పచ్చిమిర్చి 4
టొమాటోలు 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్
పుదీన 1/2 కప్
కొత్తిమీర 1/2 కప్
పసుపు 1/2 స్పూన్
ఉప్పు తగినంత
కారం 2 స్పూన్లు
ధనియాల పొడి 1 స్పూన్
నీళ్ళు 2 గ్లాసులు
గరం మసాలా పొడి 1 స్పూన్
కసూరి మేతి 1 స్పూన్
తయారీ విధానం:
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,టొమాటోలు కట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ వేడి అయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక బిర్యానీ ఆకు, మసాలా దినసులు వేసుకొని, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకుని కలుపుకోవాలి. పుదీన ఆకులను వేసి కలుపుకోవాలి.ఇపుడు కట్ చేసిన టొమాటో ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. టొమాటో ముక్కలు పూర్తిగా మగ్గించుకొని శుభ్రంగా కడిగిన చికెన్ వేసి కలుపుకోవాలి. చికెన్ ఫ్రై అయ్యాక అందులో తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకోవాలి. స్టవ్ తక్కువ మంటలో పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వత నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు చికెన్ పూర్తిగా ఉడికించుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చివరగా కసూరి మేతి వేసి, కట్ చేసిన కొత్తిమీర ఆకులను వేసి కలుపుకోవాలి.
ఎంతో రుచిగా వుండే నోరూరించే అందరికీ నచ్చే చికెన్ కర్రీ రెడీ.
chicken curry
Ingredients required:
Chicken 1/2 kg
Oil 4 spoons
Biryani leaves 2
Cinnamon 2
Pineapple flower 1
Cardamom 2
Cloves 2
Onions 2
Green chillies 4
Tomatoes 2
Ginger garlic paste spoon
Mint 1/2 cup
Coriander 1/2 cup
Turmeric 1/2 tsp
enough salt
2 tsp chilli powder
Coriander powder 1 tsp
2 glasses of water
Garam masala powder 1 tsp
Kasuri Methi 1 tsp
Method of preparation:
First, cut the onions, green chillies and tomatoes. The chicken should be washed clean and kept aside.
Light the stove, put the pan, heat the pan, add the oil, add the oil and after the oil is hot, add the biryani leaf and masala dinasa, add the chopped onion pieces and fry. Add the onion pieces and fry the green chillies. Then add ginger garlic paste and fry till the raw smell is gone. Then add turmeric and mix well. Add the mint leaves and mix well. Now add the chopped tomato pieces and fry. Tomato slices should be completely cooked and mixed with clean washed chicken.
Once the chicken is fried, add enough salt, chilli powder, coriander powder, garam masala and mix well. Keep the stove on low flame and cook for 5 minutes. Then add water and cover the lid and cook the chicken completely for 10 minutes. Once the chicken is fully cooked, turn off the stove and finally add kasuri methi and add the chopped coriander leaves and mix well.
The chicken curry is ready to be loved by everyone who is very tasty and mouth-watering.
आवश्यक सामग्री:
चिकन 1/2 किलो
तेल 4 चम्मच
बिरयानी पत्ते 2
दालचीनी 2
अनस फूल 1
इलायची 2
लौंग 2
प्याज 2
हरी मिर्च 4
टमाटर 2
अदरक लहसुन पेस्ट चम्मच
पुदीना 1/2 कप
धनिया 1/2 कप
हल्दी 1/2 छोटा चम्मच
पर्याप्त नमक
मिर्च 2 चम्मच
धनिया पाउडर 1 चम्मच
2 गिलास पानी
गरम मसाला पाउडर 1 छोटा चम्मच
कसूरी मेथी 1 चम्मच
बनाने की विधि:
सबसे पहले प्याज, हरी मिर्च और टमाटर को काट लीजिये. - चिकन को साफ करके एक तरफ रख दें.
स्टोव जलाएं और एक पैन रखें और जब पैन गर्म हो जाए तो उसमें तेल डालें और तेल गर्म होने पर उसमें बिरयानी के पत्ते, मसाला दीना, कटे हुए प्याज के टुकड़े डालें और भूनें. प्याज के टुकड़े और हरी मिर्च डालकर भूनें. - फिर इसमें अदरक लहसुन का पेस्ट डालें और तब तक भूनें जब तक कच्ची महक खत्म न हो जाए. - फिर इसमें हल्दी डालकर मिलाएं. इसमें पुदीने की पत्तियां डालकर मिलाएं। अब इसमें कटे हुए टमाटर के टुकड़े डालकर भूनें। कटे हुए टमाटर के टुकड़े डालें और धुला हुआ चिकन डालें। - चिकन फ्राई होने के बाद इसमें पर्याप्त मात्रा में नमक, काली मिर्च, धनिया पाउडर और गरम मसाला डालें. - स्टोव को धीमी आंच पर रखें और 5 मिनट तक पकाएं. - फिर पानी डालें और ढककर चिकन को 10 मिनट तक पूरी तरह पकाएं. - चिकन पूरी तरह पक जाने के बाद गैस बंद कर दें और अंत में कसूरी मेथी और कटी हुई धनिया पत्ती डालकर मिलाएं.
बहुत ही स्वादिष्ट स्वादिष्ट चिकन करी तैयार है.
Labels: Chicken curry, how to prepare, mutton curry, non-veg
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home